Tuesday, May 14, 2024

మ‌రోసారి ఉద్యోగుల‌పై వేటు.. రంగం సిద్ధం చేసిన గూగుల్

మ‌రికొంత‌మంది ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింద‌ట గూగుల్ సంస్థ‌. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావించారు. వనరులను ఎక్కడ వినియోగించాలనే దానిపై ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న నిర్ణయం కారణంగా 27 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందంటూ ఎండీ ఆ లేఖలో పేర్కొన్నారు. తమ ఖర్చులను క్రమబద్ధీకరించుకునే క్రమంలో గత కొన్ని నెలలుగా పలు మార్పులు చేసినట్టు సీఈవో ఆ లేఖలో పేర్కొన్నారు.

చాలా నాయకత్వ బృందాల్లానే తాము తమ వ్యాపారంలో మూల్యాంకనం చేస్తూ ఉంటామని, అనుకూలతలను కొనసాగిస్తామని వివరించారు. మరోవైపు, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఖర్చులను తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతీ విషయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. గూగుల్ ఈ ఏడాది జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అదే నెలలో అమెజాన్ 18 వేల మందిని ఇంటికి పంపింది. మార్చిలో తమ రెండో దశ ప్రణాళికలను కూడా అమలు చేశామని, మరో 9 వేలమందికి ఉద్వాసన పలికింది. , అంతర్జాతీయంగా 586 సంస్థలు 1,70,549 మంది ఉద్యోగులను తొలగించాయి.కాగా మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపుపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement