Thursday, May 2, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

గ‌త కొన్ని రోజులుగా బంగారం ధ‌ర పెరుగుతూ వ‌స్తోంది. కాగా నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.700 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.55 వేల 950 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.760 తగ్గింది. ప్రస్తుతం రూ.61 వేల 40 మార్క్ వద్ద ఉంది. ఇక దేశ రాజధాని హస్తినాలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.56 వేల 100 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు ఢిల్లీలో రూ.760 తగ్గి ప్రస్తుతం రూ.61 వలే 190కి చేరింది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ జీవనకాల గరిష్ఠాన్ని తాకిన వెండి రేటు ఇవాళ భారీగా కుప్పకూలింది. కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.1500 తగ్గింది. ప్రస్తుతం రూ.81 వేల 500 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండిపై రూ.1100 పడిపోయింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.78 వేల 500 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా ఉంటాయి..అంతర్జాతీయ మార్కెట్ల చూసుకుంటే బంగారం ధర దిగివచ్చింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2004 డాలర్ల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూసుకుంటే ప్రస్తుతం 25.38 డాలర్ల వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement