Saturday, May 18, 2024

TS : సీఎం చెప్పేవ‌ని అబ‌ద్దాలే… రేవంత్ పై హ‌రీష్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని, హామీలు అమలు చేయాలని కేసీఆర్ కోరితే ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ హన్మకొండలోని భీమదేవరపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా హరీష్ రావు ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

కాంగ్రెస్ కు ఓటేస్తే అబద్దాలను ఆమోదించినట్టవుతుందని, బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపిచ్చారు. రైతు బంధు ఆలస్యం చేసినందుకు అందరికి క్షమాపణ చెప్పాలని, రైతు బంధు దుక్కి దున్నాడానికి, కలుపు తీయడానికి ఇవ్వాలని, సిగ్గు లేకుండా కళ్ళల్లో వడ్లు పోయినక ఇస్తారా? సిగ్గు లేకుండా.. అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అపుడేమో ప్రమిసరి నోట్లు, ఇప్పుడేమో బాండ్ పేపర్లు, ఇక ఇప్పుడేమో దేవుండ్ల మీద ఓట్లు.. అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పేగులు తీసి మెడలో వేసుకుంటామని అంటున్నారని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది.. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తోందని, రైతు బంధు గోవిందా, కల్యాణ లక్ష్మీ గోవిందా, తులం బంగారం గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా..గోవిందా….గో..విందా అంటూవ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు తప్ప ప్రజలకు చేసేది ఎం లేదని హరీష్ రావు విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement