Tuesday, July 23, 2024

Metro | అబ్బే స‌మ‌యం పెంచటం లే..

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ సమయంలో ఎలాంటి మార్పు లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. తాజాగా మెట్రో సమయాన్ని పొడిగిస్తూ.. రాత్రి 11.45 గంటలకు మెట్రో రైలు నడుస్తుందన్న వార్తలను తోసిపుచ్చింది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు తొలి మెట్రో ప్రారంభం కానుందన్న వార్త కూడా ఫేక్ అని కొట్టిపారేశారు. మెట్రో రైళ్లు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని స్పష్టం చేశారు.

ఈ కొత్త సమయాలను అమలు చేయడం లేదని…. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు మెట్రో రైళ్ల రాకపోకలను కేవలం పరిశీలించామన్నారు. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలు, రైళ్లు, ట్రాక్‌ల నిర్వహణపై మాత్రమే పరిశీలన జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రయాణికులు అనవసర గందరగోళానికి గురికావద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement