Wednesday, May 22, 2024

TS : పద్మశ్రీ మొగిలయ్యకు సహాయం చేసిన కేటీఆర్

తెలంగాణ జానపద కళాకారుడు మొగిలయ్య కూలీ పనికి వెళ్తున్న విష‌యం తెలుసుకున్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయ‌న‌ను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆదివారం మొగిలయ్యను కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు.

- Advertisement -

మొగిలయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్‌తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొగిలయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగిలయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారీ జీవితం గడపడడమే కష్టంగా ఉన్న ప్రస్తుత త‌రుణంలో కేటీఆర్ చేసిన సహాయంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement