Saturday, June 22, 2024

TS | ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పార్టీ లీడర్లకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్‌ నేతలు క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. ఈనెల 27న పోలింగ్‌కు కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలన్నారు. తమ పరిధిలోని అన్ని బూత్‌లను ఎమ్మెల్యేలు సందర్శించాలని, పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు. ఈ స‌మావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్‌ఛార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జిలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement