Monday, June 3, 2024

IPL eliminator | ఆర్సీబీ త‌డ‘బ్యాటు’.. రాజస్థాన్ ముందు ఈజీ టార్గెట్

ఎలిమినేట‌ర్ పోరులో రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు కష్టాల్లో ప‌డింది. కీల‌క మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టును రాజ‌స్థాన్ రాయల్స్‌ అదుపు చేయ‌గ‌లిగింది. క్రీజ్‌లోకి వచ్చిన ఆటగాళ్లంత స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (33), ఫాఫ్ డు ప్లెసిస్ (17), కామెరాన్ గ్రీన్ (27), రజత్ పాటిదార్ (34) మహిపాల్ లోమ్రోర్ (32) పరుగులకే వెనుదిరిగారు.

ఇక రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఒక ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 173 పరుగుల టార్గెట్‌తో రాజస్థాన్ జట్టు బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement