Sunday, May 12, 2024

ఆ అద్భుత చిత్రానికి 15 ఏళ్ళు

దర్శకేంద్రుడు… కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో శ్రీ రామదాసు ఒకటి. ఆదిత్య మూవీస్ పతాకంపై కొండా కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో కబీర్ దాస్ గా అక్కినేని నాగేశ్వరరావు, రామదాసుగా నాగార్జున నటించారు. అదేవిధంగా స్నేహ నాగార్జున సరసన నటించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా..!!

శ్రీరామదాసు సినిమాకు నేటికీ పదిహేనేళ్లు. 2016 మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. కాగా ఈ సినిమాలో శ్రీరామదాసుగా నటించిన నాగార్జునకు ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. అలాగే సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రంగా కూడా నందిని సొంతం చేసుకుంది. మేకప్ మ్యాన్ రామచంద్రరావుకు కూడా నంది అవార్డు లభించింది. ఉత్తమ గాయకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, ఉత్తమ ఛాయాగ్రాహకునిగా ఎస్.గోపాల్ రెడ్డికి ఫిలిమ్ ఫేర్ అవార్డులను సైతం ఈ సినిమా సంపాదించి పెట్టిందంటే అతిశయోక్తి కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement