Tuesday, July 23, 2024

TS | తెలంగాణకు 4 రోజుల పాటు వర్ష సూచన.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ఈ నెల 12న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అక్కడక్క ఈదుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. 14న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని చెప్పింది.

14న ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు.. 15న నిజామాబాద్‌, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement