Tuesday, May 28, 2024

KKR vs MI | నైట్‌రైడర్స్‌ను ఆదుకున్న మిడిలార్డర్‌‌.. ముంబై టార్గెట్ ఎంతంటే

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలత బ్యాటంగ్ చేసని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు దంచారు. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైనా.. మిడిలార్డ‌ర్ బ్యాటర్లు ఆదుకున్నారు. వర్షం అతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవ‌ర్ల‌కు కుదించగా.. 7వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించారు.

వెంక‌టేశ్ అయ్య‌ర్(42), సనితీశ్ రానా(33), ఆండ్రీ రస్సెల్ (24) లు ధ‌నాధ‌న్ ఆడారు. చివ‌ర్లో రింకూ సింగ్(20), ర‌మ‌న్‌దీప్ సింగ్‌(17 నాటౌట్‌)లు బౌండ‌రీల‌తో చెల‌రేగారు. ఇక ముంబై బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా రెండేసి వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార చెరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement