Tuesday, July 23, 2024

Apple | ఓపెన్‌ఏఐతో ఆపిల్‌ జట్టు.. ఐఫోన్‌లో చాట్‌జీపీటీ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వేగంగా అన్ని రంగాల్లోకి చేరుతోంది. పలు సంస్థలు, కంపెనీలు ఇప్పటికే తమ పరికరాల్లో ఏఐ సాంకేతికను తీసుకు వచ్చాయి. అనేక కంపెనీలు కొత్తగా లాంచ్‌ చేసిన మొబైల్స్‌లో ఏఐ ఫీచర్లును జోడించాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ ఆపిల్‌ కూడా కొత్తగా తీసుకురానున్న ఐఓఎస్‌18లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అందులో భాగంగా చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్‌ ఏఐతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ సంవత్సరం యాపిల్‌ ఆవిష్కరించనున్న ఐఫోన్‌ 16 సిరీస్‌లో జనరేటివ్‌ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మార్కెట్‌లోకి విడుదలైన గూగుల్‌ ఫిక్సెల్‌ 8, శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లు ఏఐ ఆధారిత టూల్స్‌, యూప్‌లతో వచ్చాయి. ఆపిల్‌ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంది.

ఐఓఎస్‌ 18తో ఈ లోటును తీర్చనుంది. దీని కోసం ఓపెన్‌ ఏఐతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ తాజా ఒప్పందం ఖారారైనట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. గూగుల్‌ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ జెమినికి లైసెన్స్‌ ఇవ్వాలని ఆల్ఫాబెట్‌తో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

త్వరలో ఏఐ ఫిచర్లను ప్రవేశపెట్టాలన్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐతో ఒప్పందం ఖరారయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆపిల్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ టీమ్‌ కుక్‌ తాను వ్యక్తిగతంగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఆపిల్‌ ఉత్పత్తుల్ల్లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement