Saturday, April 27, 2024

మరో తెలుగు సినిమా రీమేక్ కు సిద్ధం అవుతున్న సల్మాన్ ?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సల్మాన్ కు సౌత్ సినిమాలు అంటే ముందు నుంచే ఎంతో ఇష్టం. అయితే ఇప్పటికే కొన్ని సౌత్ చిత్రాలను రీమేక్ చేసిన సల్మాన్ ఇప్పుడు మరో తెలుగు సినిమాని రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే ఈ సారి పై డైరెక్ట్ గా సెట్స్ పై ఉన్న సినిమానే రీమేక్ చేయబోతున్నాడట.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ కి చెందిన పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట సల్మాన్. అంతే కాదు రమేష్ వర్మనే బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ చేయనున్నాడట. గతంలో రవితేజ కిక్ మూవీ ని హిందీ లో సల్మాన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement