Friday, March 29, 2024

పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మానసా రాధాకృష్ణన్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్, ఫస్ట్ లుక్ విషయంలో అయితే అవి మరింత వైరల్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ విషయంలో కూడా గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ నటిస్తుందని టాక్ నడిచింది.

అయితే ఇప్పుడు ఈ విషయంపై మానసా రాధాకృష్ణన్ క్లారిటీ ఇచ్చారు. పవన్ చేస్తున్న 28వ సినిమాలో తాను నటించడం లేదని కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక మానసా రాధాకృష్ణన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లోఇప్పుడు వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement