Sunday, April 28, 2024

శాకుంత‌లం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. రూ.5కోట్లు

స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం శాకుంత‌లం.ఈ చిత్రం నిన్న విడుద‌లైంది. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా మలయాళీ యంగ్ హీరో దుష్యంతుడు కనిపించగా.. వీరి కుమారుడు భరతుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం శాకుంత‌లం. ఈ మూవీ మొదటి రోజు రూ. 5 కోట్లు రాబట్టింద‌ట‌. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 32.60% ఆక్యుపెన్సీని పొందింది. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను మరింత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాలని డైరెక్టర్ గుణశేఖర్ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విడుదలకు ముందు ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల కీలకపాత్రలలో నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement