Friday, May 3, 2024

AP : తెదేపా గూటికి చేరిన వరం కుటుంబం

శ్రీకాకుళం, ఏప్రిల్ 28(ప్రభ న్యూస్): అధికార పార్టీ వైసీపీకి శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబం నేడు మళ్లీ తెదేపా గూటికి చేరింది. గుజరాతిపేట ప్రాంతం మొత్తం ప్రజలు ఏకతాటి పైకి వచ్చి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గుజరాతిపేటలోని వరం ఇంటి వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

మున్సిపల్ మాజీ చైర్మన్ అంధవరపు వరం కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పైడిశెట్టి జయంతి,అంధవరపు ప్రసాద్, సంతోష్ లకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. వీరితోపాటు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు భరోసా కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. నేడు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం చూపి పార్టీలో ఇన్ని వందల కుటుంబాలు చేరడం గొప్ప విశేషం అన్నారు.

పార్టీలో చిన్న పెద్ద అన్న బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుజరాతిపేట నిలిచిందో నేడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ మాట్లాడుతూ ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబం నేడు తెలుగుదేశం పార్టీలో చేరడం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో మరింత అదనపు బలమని పేర్కొన్నారు. పార్టీలో వైశ్యులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు తాను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత వరం ఆశయాలను కొనసాగించేందుకు గుజరాతిపేట ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.

ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. దీనికోసం మనమంతా మరింతగా కృషిచేసి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గోండు శంకర్ లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక చిన్న పిలుపుతో నేడు ఇంతమంది వైసీపీని వీడి తమతో కలిసి నడిచేందుకు సిద్ధమైన ప్రతి ఒక్కరికి జయంతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భోయిన గోవిందరాజులు, మాదారపు వెంకటేష్, పివి రమణ, కొర్ను ప్రతాప్, పైడిశెట్టి బెనర్జీ, జామి భీమ శంకర్, కిల్లం శెట్టి చక్రవర్తి, కరగాన భాస్కరరావు, కరగాన రాము, సీపాన మల్లేశ్వరరావు, కవ్వడ సుశీల, సీపాన రమ, రమేశ్, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement