Friday, May 3, 2024

TS : చిరుత కలకలం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే‌పై సంచారం

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం క‌ల‌క‌లం రేపింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించారు. విమానాశ్రయం రన్ వే పై చిరుత సంచారం ఉన్నట్లు గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విమానాశ్రయంలో ఉన్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.

- Advertisement -

ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. వీడియోలో, చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది.

మూడేళ్ల క్రితం..
అయితే, దాదాపు మూడేళ్ల కిందట ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డయింది. దానిని పట్టుకోడానికి బోన్లు ఏర్పాటు చేసి, గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే, 2019 నవంబరు 27న విమానాశ్రయ పరిసరాల్లో చిరుత తిరుగుతోందన్న సమాచారంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఫారెస్ట్, జూ అధికారులను అక్కడకు రప్పించారు. రెండుగంటల పాటు ముమ్మరంగా గాలించగా.. అది చిరుత కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికది చిరుత పులి కాదు అడవి పిల్లి అని తేల్చారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి రేపుతోంది. అది అసలు చిరుతేనా? లేక గతంలో మాదిరి అడవి పిల్లా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement