Saturday, April 27, 2024

ఐపిఎల్ – 20 ఓవ‌ర్ల‌లో ఆర్ సి బి 174/6 …ఢిల్లీ క్యాపిట‌ల్స్ టార్గెట్ 175

బెంగుళూరు- ఐపీఎల్ 16 వ సీజన్లో నేడు ఆర్ సి బి తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది.. ఈ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 174 ప‌రుగులు చేసింది. దీంతో ఢిల్లీ గెల‌వాలంటే 175 ప‌రుగులు చేయాల్సింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబి ఓపెన‌ర్లు శుభారంభం చేసినా ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్ మెన్ లు ప‌రుగులు సాధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.. ముఖ్యంగా 14 ఓవ‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఔట్ కాగా,ఆ వెంట‌నే మ్యాక్స్ వెల్ పెవిలియ‌న్ కు చేరాడు.. ఆ త‌ర్వాత మ‌రో బంతికి దినేష్ కార్తిక్ కూడా ఔట‌య్యాడు.. మాక్స్ వెల్, దినేష్ వికెట్లు కుల‌దీప్ ప‌డ‌గొట్ట‌గా, హ‌ర్ష‌ల్ వికెట్ అక్ష‌ర్ కు ద‌క్కింది.. ఈ మూడు వికెట్లు రెండు బంతుల వ్య‌వ‌ధిలో కుప్ప‌కూల‌డంతో భారీ స్కోర్ కి బ్రేక్ ప‌డింది.. ఇక ఏడో వికెట్ కు షాబాజ్,రావ‌త్ లు 42 ప‌రుగులు జోడించ‌డంతో కాస్త‌మంచి స్కోర్ సాధించ‌గ‌లిగింది.. షాబాజ్ 20 ,రావ‌త్ 15పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
అంత‌కు ముందు మూడో వికెట్ గా లామ్ రోర్ ఔట‌య్యాడు.. మార్ష్ బౌలింగ్ లో అవ‌టైన లామ్ రోర్ 26 ప‌రుగులు చేశాడు. అంత‌కు ముందు ఆర్ సి బి ఓపెన‌ర్లు డుప్లెసిస్, కోహ్లీలు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో ఆట‌ను ప్రారంభించారు.. అయితే అయిదో ఓవ‌ర్లో డుప్లెసిస్ 22 ప‌రుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్ లో అవుట‌య్యాడు.. తొలి వికెట్ 42 ప‌రుగుల వ‌ద్ద ప‌డింది..ఇక మ‌రో ఓపెన‌ర్ విరాట్ కోహ్లీ ఫోర్లు,సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు… 33 బంతుల‌లో ఆరు ఫోర్లు,ఒక సిక్స్ తో అర్ధ శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు.. అనంత‌రం ల‌లిత్ యాద‌వ్ బౌలింగ్ 50 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. మ్యాక్స్ వెల్ 24 ప‌రుగులు , హ‌ర్ష‌ల్ 6 ప‌రుగులు, దినేష్ సున్న ప‌రుగులు పెవిలియ‌న్ కు చేరారు.

జట్ల వివరాలు
డిల్లీ క్యాపిటల్స్
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, యష్ ధూల్, మనీష్ పాండే , అక్ష‌ర ప‌టేల్,ల‌లిత్ యాద‌వ్, అమ‌న్ ఖాన్, అభిషేక్ పొరేల్, కుల‌దీప్ యాద‌వ్, నోర్ట్జి, ముస్తాఫాజుర్ ఖాన్
స‌బ్ – పృథ్వీ షా,ముఖేష్ కుమార్, ప్ర‌వీణ్ డూబే, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, చేత‌న్ స‌కారియా

ఆర్సీబి
డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ‌హిపాల్ లోమ్రార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మాద్, దీనేష్ కార్తీక్, హ‌స‌రంగ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్, ప‌ర్నేల్, సిరాజ్, విజ‌య్ కుమార్
స‌బ్ – సుయేష్ ప్ర‌భుదేశాయ్, డివిల్ విల్లీ,అకాష్ దీప్ ,క‌ర‌ణ్ శ‌ర్మ‌,అన్జూ రావ‌త్

Advertisement

తాజా వార్తలు

Advertisement