Sunday, May 12, 2024

బ్రో మూవీ అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది- సాయి ధ‌ర్మ్ తేజ్

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ‌త రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుక‌లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ “ముందుగా ఈ సినిమా చేయాలని కళ్యాణ్ మామయ్య చెప్పినప్పుడు సరి చేసేస్తాను అన్నాను. కానీ ఇది ఒక మల్టీ స్టారర్ అని నువ్వు మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నావు, నేను మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అని చెప్పగానే షాక్ అయ్యాను. సినిమాలో నేను మెయిన్ లీడ్ ఏంటి? మీరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా? ఊరుకోండి మావయ్య అంటే లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నారు. నేను బయలుదేరి వెళ్లాను. అక్కడికి వెళ్ళాక కూడా ఆయన నాకు ఫోన్లో చెప్పింది మళ్ళీ రిపీట్ చేశారు.

అయితే ముందు సినిమా చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టి నాకు మనసు ఒప్పలేదు. కానీ నాకు ఆ విషయం తర్వాత అర్థమైంది. నన్ను ఏడిపించడానికి అలా చెప్పారు. కానీ ఆ ఏడిపించడాన్ని క్యాప్చర్ చేయడానికి సముద్రఖని చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఎప్పుడో ఓకే అయింది. అయితే అప్పటికి నేను ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను. నేను దాదాపు 12 రోజుల్లో కోమాలో ఉంటే మా కళ్యాణ్ మామయ్య ప్రతిరోజు సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి కూర్చునే వాడు. నా చేయి పట్టుకొని నీకేమీ కాదురా అని చెప్పేవాడు. నాకు ప్రతి సారి అది వినపడుతూనే ఉండేది. థాంక్యూ మామయ్య థాంక్యూ సో మచ్ లవ్ యు.

అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది, అభిమానులందరూ చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని తొడగొట్టి ముందుకు వెళుతూ ఉంటారు. అదైతే ప్రామిస్ చేసి చెప్పగలను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చిన్న స్పెషాలిటీ ఉంది. వాళ్ళు మొదట్లో చేసిన సినిమా వెంకీ మామ అని చెప్పారు, అందులో ఒక మేనమామను మేనల్లుడిని కలుపుతారు. ఈ సినిమాతో కూడా ఒక మేనమామని, మేనల్లుడిని కలిపారు. సార్ ఇది చాలా స్పెషల్, నాకు ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. జీవితంలో చివరి క్షణం వరకు గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మెమరీ ఇది. సముద్రఖని గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్, నేను కథ విన్నప్పుడు ఎలా ఎక్సయిట్ అయ్యానో అదే విధంగా సినిమా తీశారు. హ్యాట్సాఫ్ టు యు. మీరు ఏమైతే ఒక విజన్ తో సినిమాని ఊహించుకున్నారో దాన్ని తెరమీద చూపించారు. త్రివిక్రమ్ గారికి నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకోవాలి. నాకు మా మామయ్యతో, మా గురువుగారితో నటించే అవకాశం ఇప్పించారు. నాతో ఈ పాత్ర చేయించాలనే ఆలోచన ఆయనకే వచ్చింది, అందుకే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. మా డీఓపీ సుజిత్ గారు చాలా బాగా క్యాప్చర్ చేశారు. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా అయితే మేము అనుకున్నామో, ఎలా అయితే మేము ఉన్నామో దాన్ని అలాగే క్యాప్చర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి గారికి థాంక్స్. నాతో కలిసి నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈవెంట్ కి వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీదకు నేను రావడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలకి నేను ఎల్లకాలం తలవంచే ఉంటాను.” అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement