Wednesday, July 24, 2024

RCB vs DC | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

ఐపీఎల్‌లో నేడు (ఆదివారం) జరుగుతున్న మరో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ… బౌలింగ్ ఎంచుకుని బెంగళూరు జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

అయితే, మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు గాను ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్‌ యాజమాన్యం ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది.దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ సారధ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.

జట్ల వివరాలు :

ఢిల్లీ క్యాపిటల్స్ : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్ (WK), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్ (c), కుల్దీప్ యాదవ్, రసిఖ్ సలామ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్

గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి బెంగ‌ళూరు…

- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి బెంగళూరు జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఆరంభ మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన బెంగళూరు ఆ తర్వాత అసాధారణ ఆటతో చెలరేగి పోతోంది. వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపుపై కన్నేసింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఛాలెంజర్స్ సమతూకంగా కనిపిస్తోంది. కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ తదితరులు జోరుమీదున్నారు. బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. ఇక ఢిల్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రిషబ్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అతను లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement