Saturday, July 24, 2021

రామ్ చరణ్ కొత్త సినిమా హీరోయిన్ మళ్ళీ తెరపైకి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ పై రకరకాల వార్తలు తెరపైకి రాగా… ముఖ్యంగా కియారా అద్వానీ పేరు మొదటినుంచి వినిపిస్తూ వస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… కియారా అద్వానీ నే ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News