Friday, April 26, 2024

కేటీఆర్‌పై ఉన్న అభిమానాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన రైతు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెధిరా గ్రామంలో అర్జున్ అనే రైతు మంత్రి కేటీఆర్ మీద ఉన్న తనకు ఉన్న అభిమానాన్ని సరికొత్తగా చూపించాడు. తనకు ఉన్న పొలంలో వరి నాట్లు వేయడానికి వేసిన నారు మడిలో ఇంగ్లీషులో మంత్రి కేటీఆర్ అక్షరాల రూపంలో తీర్చిదిద్దాడు. ఇది చూసిన పలువురు స్థానికులు రైతు అర్జున్‌ను అభినందిస్తున్నారు.

కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై ఆకర్షితుడినై ఇలా గత రెండు, మూడేళ్ల నుండి పొలంలో నారు మడిని కేటీఆర్ అక్షరాలతో పెంచుతున్నానని రైతు అర్జున్ వివరించాడు. కాగా అర్జున్ వేసిన నారుమడిని పలువురు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

ఈ వార్త కూడా చదవండి: సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక

Advertisement

తాజా వార్తలు

Advertisement