Saturday, April 20, 2024

తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ తదితర జిల్లాల్లో వానలు భారీగా పడింది.  సిద్దిపేట-హన్మకొండ రోడ్డులో బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నంగునూరు, ధూళిమిట్ట మండలంలో చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement