Wednesday, April 24, 2024

కేసీఆర్.. ఖబర్దార్.. నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక

హైదరాబాద్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష పెట్టే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని నిరుద్యోగ, ఓయూ,కెయూ జెఏసి నేతలు ముట్టడించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వలయాన్ని తప్పించుకుని ఉన్నత విద్యామండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య ఉద్యోగాలు భర్తీలో ఏకీకృత పరీక్ష విధానం ఆలోచన విరమించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ మండిపడ్డారు. పిహెచ్‌డికి ఉమ్మడి పరీక్ష పెట్టటం వల్ల విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని తెలిపారు. సహాయ ఆచార్య ఉద్యోగాలకి ఏకీకృత పరీక్ష పెడితే స్థానిక తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement