Saturday, April 27, 2024

ఎఫ్ 3 లో ప్రగ్యా జైస్వాల్ ఐటమ్ సాంగ్ ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్2. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో కొత్తగా సునీల్ , అంజలి పాత్ర లు యాడ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

కాగా ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుండటంతో షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట దర్శక నిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ కి గాను ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేశారట యూనిట్ సభ్యులు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐటెం సాంగ్స్ కు మ్యూజిక్ ని అందించడంలో దేవిశ్రీప్రసాద్ దిట్ట. మరి ఈ ఈ సినిమాకు దేవి ఎలాంటి సాంగ్స్ అందించారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement