Monday, July 26, 2021

కేసీఆర్ పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యేకు అవమానం

తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యే పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని కేయూ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దే పోలీసులు తన వాహనాన్ని నిలిపివేయడంతో ఎమ్మెల్యే మనస్తాపం చెందారు. దీంతో అక్కడి నుండి మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్లారు. కాగా పోలీసుల తీరుకు నిరసనగా అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News