Thursday, April 18, 2024

ఉసేన్ బోల్ట్​‌కు కవలలు

పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలు కలిగినట్టు బోల్ట్, ఆయన అర్ధాంగి కాసి బెనెట్ నిన్న ప్రకటించారు. అంతేకాదు పిల్లల పేర్లనూ వెల్లడించారు. తన ఇద్దరు కుమారులకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని బోల్ట్ దంపతులు నామకరణం చేశారు. తమ కూతురుకూ అదే స్టైల్ లో ఒలంపియా లైట్నింగ్ బోల్ట్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని బోల్ట్, ఆయన భార్య కాసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బోల్ట్ కు కాసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. తమ పిల్లలకు ఓ గొప్ప తండ్రి దొరికాడంటూ ఇన్ స్టాలో కామెంట్ చేసింది.

ఉసేన్ బోల్ట్ తన కెరీర్ లో ప్రధాన చాంపియన్ షిప్ లలో 23 గోల్డ్ మెడల్స్ గెలిచాడు. రిటైర్మెంట్ తర్వాత ఫుట్ బాల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకున్న బోల్ట్ కు నిరాశే ఎదురైంది. అతడికి కాంట్రాక్ట్ దక్కలేదు. దీంతో 2019లో అన్ని క్రీడల నుంచి తప్పుకొంటున్నట్టు బోల్ట్ ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement