Tuesday, May 14, 2024

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ ఫోటో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. అలాగే దీంతోపాటు మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ లో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ బుల్లెట్ పై కూర్చొని కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement