Monday, April 29, 2024

మార్చి 27 మెగా ఫ్యాన్స్ కి పండగే !!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆర్ ఆర్ ఆర్ నుంచి రామ్ చరణ్ కు సంబంధించిన మరో వీడియో రాబోతోందని తెలుస్తోంది. మరోవైపు సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కూడా అభిమానుల కోసం ఓ గిఫ్ట్ సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు.

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా శంకర్ కు 50వ సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement