Friday, October 11, 2024

Nora Fatehi : నోరా జిగేల్…

టాలీవుడ్‌ ప్రేక్షకులకు టెంపర్‌, కిక్‌ 2, లోఫర్‌, ఊపిరి తో పాటు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో ఒకానొక సమయంలో బిజీ బిజీగా గడిపింది.

- Advertisement -

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉన్న ఈ అమ్మడి తాజా ఫోటోలు అంతకు మించి అన్నట్లుగా వైరల్‌ అయ్యాయి.

అప్పట్లో రూ.50 కోట్లు, ఇప్పుడు 20 కోట్లు ఈసారి పెద్దగా స్కిన్‌ షో చేయకుండా పింక్ డ్రెస్ లో హొయలు పోతూ అందాల ముద్దుగుమ్మ కవ్వించే విధంగా ఫోటోలకు ఫోజ్ లు ఇస్తూ ఆకట్టుకుంది. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే నెటిజన్స్‌ వైరల్‌ చేయకుండా ఎలా ఉంటారు అంటూ తెగ షేర్‌ చేస్తున్నారు.

నోరా ఫతేహి గతంలో అందాల ఆరబోత ఫోటోలతో వైరల్‌ అయ్యింది. అయితే ఈసారి ఏమాత్రం స్కిన్‌ షో చేయకుండానే భలే ఉందే అనిపించే విధంగా ఫోజ్ ఇచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అవ్వడం వల్ల వయసు పెరుగుతున్నా కొద్ది అందంగా కనిపిస్తుంది. బాలీవుడ్ లో మెయిన్‌ లీడ్‌ పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నా కూడా ఇంకా మంచి పాత్రలు కావాలంటూ ఈ మధ్య కొన్నింటిని ఈమె తిరస్కరించిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో నిజం ఎంతో ఏమో కానీ ఇదే అందాల జోరు కొనసాగిస్తే మరో పదేళ్ల పాటు ఈ అమ్మడి సందడి సోషల్‌ మీడియాలో కొనసాగడం ఖాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement