Friday, May 10, 2024

Exclusive – నార్త్ పై ఫోకస్​! …అమేథిలో రాహుల్…రాయబరేలీలో ప్రియాంక…

( ఆంధ్రప్రభ స్మార్ట్, దిల్లీ ప్రతినిధి) : దక్షిణాదిలో కీలక కేరళ, తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాల్లో కాస్త మెరుగైన పోటీతత్వాన్ని ప్రదర్శించి.. ఇక తెలంగాణలో ఎలాగూ తిరుగు ఉండదు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా కీలక నాయకుల అండతో తెలంగాణాలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటామని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మరో పక్క తెలంగాణ బాటలోనే ఏపీలో కూడా కాంగ్రెస్ దూకుడు పెంచింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తన దూకుడు పెంచారు. త్వరలో తెలంగాణ నేతలు కూడా ఏపీలో ఆమెకు తోడుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ స్థితిలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి దెబ్బతప్పదని.. కాగా, ఇక ఉత్తర భారతంలో పునరుత్తేజం కోసం కాంగ్రెస్ పార్టీ తన మేథోమధనం ప్రారంభించింది. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలు అమేథీ, రాయ బరేలీపై దృష్టి సారించాయి. యువ నాయకులు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని ఆలోచిస్తోంది.

అన్నాచెల్లెలి కోసం..

ఉత్తర ప్రదేశ్​లో కంచుకోటల్ని కాపాడుకోవాలంటే.. ఇందిరా గాంధీ వారసులను రంగంలోకి దించాల్సిందేనని యూసీ కాంగ్రెస్ నేతలు పట్టుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో అమేథీ, రాయ్ బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్టు సమాచారం. కానీ ఈ రెండు నియోజకవర్గాల నుంచి అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ పోటీకి అధిష్టానం అంగీకరిస్తుందా? లేదా అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

కేరళలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తాడని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా… ఒక వేళ జరగరానిది జరిగితే.. పరిస్థితి ఏమిటీ? ఇప్పటికే బీజేపీ చలవతో రాహుల్ ను లోక్ సభ గెంటివేసింది. ఇప్పుడు వయనాడ్ లో ఓడితే.. ప్రాతినిథ్యం లేని నాయకుడిగా.. దేశంలో యాత్రలు నిర్వహించే స్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన నెలకొంది. ఈ స్థితిలో అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించాలని కాంగ్రెస్ శ్రేణులు ఒత్తిడి పెంచుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ పీసీపీ నేతలు వాదిస్తున్నారు. యూపీలోని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి అవినాష్ పాండే, యూపీ సీఎల్పీ నేత ఆరాధన మిశ్ర తమ వాణిని వినిపించారు. యూపీలోని అమేథీ, రాయబరేలీ ఎంపీ సీట్లను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అభ్యర్థించారు.

రాయ్​బరేలీలో ప్రియాంక ఖాయం?
రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉన్నా.. రాయ బరేలీ నుంచిప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్​బరేలీ రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము డిలీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామని, రాయబరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు ప్రారంభిస్తామని తివారీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement