Sunday, April 28, 2024

పవన్ తో త్రివిక్రమ్ మరో సినిమా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్నాడు. వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

కాగా వీటితోపాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో కూడా పవర్ స్టార్ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన వెంటనే పవన్ సినిమాపై కి త్రివిక్రమ్ రానున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం చెయ్యలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement