Saturday, April 27, 2024

మెగా అభిమానులు చిందులు వేయాల్సిందే !! చెర్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లుడు సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ తో సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ కథలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం హిందీలో లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని అనుకుంటున్నారట. అలాగే కన్నడ లో కిచ్చా సుదీప్, ఉపేంద్రని కానీ తీసుకోబోతున్నారట. అలాగే తమిళ ప్రేక్షకుల కోసం విజయ్ సేతుపతి ని కూడా తీసుకుంటున్నారట.

ఇక తెలుగు విషయానికి వస్తే ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి ని మొదట అనుకున్నారట. కానీ ఆచార్య లో చిరు, చరణ్ నటిస్తున్నారు. కాబట్టి ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని బావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో మాత్రం తెలియడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement