Friday, April 26, 2024

పంచ‌తంత్రం ట్రైల‌ర్ రిలీజ్‌.. డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న మూవీ

కొంత కాలం నుంచి టాలీవుడ్ లో డీసెంట్ బజ్ తో కొనసాగుతున్న బ్యూటిఫుల్ ఆంథాలజీ మూవీ “పంచతంత్రం”. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఓ లీడ్ రోల్‌లో ఈ సినిమా తెరక్కుతుంది. కాగా, ఈరోజు ఈ మూవీకి సంబంధించిన‌ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే బ్రహ్మానందనం మాటలతోనే స్టార్ట్ అయిన‌ ఈ ట్రైలర్ మొత్తం ఐదు వేర్వేరు కథలతో ఉండనున్నట్టు అర్థం అవుతుంది.

కాగా సీనియర్ నటుడు సముద్రఖని నుంచి యంగ్ నటీ నటులు నరేష్ అగస్త్య, స్వాతి రెడ్డి, దివ్య ద్రిష్టి, ఆదర్శ్ బాలకృష్ణలపై చూపించిన ప్రతి స్టోరీ చాలా హార్ట్ టచింగ్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాస్ట్ లో ఎమోషన్స్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ అనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఒకొక్కరి కథలోని సెన్సిబుల్ ఎమోషన్స్ ఓ ఫీల్ గుడ్ అనుభూతిని అందించడమే కాకుండా మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ ఫీల్ గుడ్ ఆంథాలజీ చిత్రం చూస్తున్నాం అనిపించేలా ఉంది.

మరి డైరెక్టర్ హర్ష పులిపాక సాలిడ్ వర్క్ ని అందించారని చెప్పాలి. అలాగే శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం ట్రైలర్ లో బాగున్నాయి. మరి ఈ చిత్రాన్ని అయితే టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిగినల్స్ బ్యానర్ వారు నిర్మాణం వహించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement