Thursday, April 25, 2024

వైఎస్‌ వివేకా హత్యకేసులో వారినీ విచారించాలే.. తులసమ్మ కీలక వాంగ్మూలం

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో శనివారం సంచలన వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ తీరును తప్పుబడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఇన్నాళ్లూ విస్మరించిన అనేక విషయాలను న్యాయస్థానం దృష్టికి వచ్చాయి. తులసమ్మ తన వాంగ్మూలంలో ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవీ..

వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే హత్యకు దారి తీశాయని, రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు ఆమె కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడం ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తీవ్ర ఆందోళన కలిగించిందని తెలుసత్ఓంది. వివేకా రాజకీయ, కుటుంబ వారసత్వాన్ని ఆశిస్తున్న నర్రెడ్డి రాజశేఖరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డే ఆయన హత్యకు కుట్రపన్నినట్టు ఆరోపణలున్నాయి.

హత్య అనంతరం వివేకా కుటుంబ సభ్యుల ప్రవర్తన సందేహాస్పదంగా ఉందని చాలామంది చెబుతున్నారు. వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణా రెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపడం కూడా ఇప్పుడు సందేహంగా మారింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డికి వాట్సాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వాటిని చూసిన తరువాత శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పిన‌ట్టు స‌మాచారం. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు కూడా వెల్లడించారు.

- Advertisement -

కాగా, వివేకా కుటుంబ సభ్యులు పులివెందుల చేరుకున్న తరువాత సెల్‌ఫోన్లో ఉన్న మెస్సేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్‌ చేసిన తరువాతే సాయంత్రం వాటిని పోలీసులకు అప్పగించిన‌ట్టు తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి గదిని తుడిచి, మృతదేహాన్ని బాత్రూమ్‌ నుంచి గదిలోకి తేవాలని తనకు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే చెప్పాడని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి కూడా ఒప్పుకున్నట్టు స‌మాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement