Saturday, April 27, 2024

ద‌స‌రా చిత్రం నుండి నాలుగో లిరిక‌ల్.. బాల్యాన్ని కళ్ల ముందుంచే పాట

ద‌స‌రా మూవీ నుండి నాలుగో లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రంలో హీరోగా నాని..హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టించారు.ఇక ఈ సాంగ్ ఓ అమ్మలాలో .. అమ్మలాలో’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో … హీరోయిన్ బాల్యం, ఆ రోజుల్లో వాళ్లు గడిపిన ఆనందకరమైన క్షణాలు .. అనుభూతులను పంచుకున్న సంఘటనలను కలుపుకుంటూ ఈ పాట నడిచింది.
ఒకప్పటి బాల్యాన్ని కళ్ల ముందుంచే పాట ఇది. ప్రతి ఒక్కరికీ ఈ పాట కనెక్ట్ అవుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి , సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నానికి పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.ఈ చిత్రంలో ఊర‌మాస్ లుక్ లో మెర‌వ‌నున్నారు హీరో నాని.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement