Friday, April 26, 2024

వకీల్ సాబ్ ఫైట్ ని ఇరగదీసిన నెల్లూరు కుర్రాళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ పవన్ సరసన నటించగా నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదిలా ఉండగా తాజాగా వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీక్వెన్స్ ను వీడియోగా ఎడిట్ చేశారు నెల్లూరు కు చెందిన కొంత మంది యువకులు. ఆ వీడియోలో కెమెరా యాంగిల్స్ టైమింగ్ అన్నీ కూడా సినిమాల్లో అయితే ఏవిధంగా చూపించారో అలానే అచ్చం తీశారు. అయితే ఈ వీడియోకు అటు సినీ అభిమానులు నెటిజెన్స్ అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా క్రేజీ గాయ్స్ అంటూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement