Friday, April 26, 2024

చ‌దువులు పేరుతో ఒత్తిడి పెంచుతున్నారు….

షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు నటించిన చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. ఇళయరాజా సంగీతం అందించారు. మే 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన దిల్‌ రాజు చేతుల మీదుగా మ్యూజిక్‌ స్కూల్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు.
దిల్‌ రాజు మాట్లాడుతూ ”సినిమాపై ప్యాషన్‌ ఎలా ఉంటుందనడానికి ఈ సినిమా ఒక ఉదాహారణ. ఈ సినిమా దర్శకుడు పాపారావు అపాయింట్‌మెంట్‌ కోసం చాలా మంది తిరుగుతుంటారు. అలాంటి వ్యక్తి సినిమాపై ప్యాషన్‌తో తన ఉద్యోగానికి రిజైన్‌ చేసి సినిమారంగంలోకి అడుగుపెట్టారు. కుటుంబాల్లో ఉంటే సమస్యలు పిల్లల చదువుపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయనేది ఈ చిత్రం. శ్రియా ప్రధాన పాత్రధారి. మిగతా పాత్రల్లో పిల్లలు నటించారు.” అని చెప్పారు.


పాపారావు ఐఏయస్‌ అధికారి. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఆయన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ”ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తల్లితండ్రులు, టీచర్స్‌, సమాజం పిల్లలపై చదువుపేరుతో ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి వాటివల్ల అభివృద్ది జరగదు. దీన్ని సంగీత రూపంలో చెప్పేందుకు ప్రయత్నించాం” అని పాపారావు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement