Friday, April 26, 2024

మంచు లక్ష్మికి కేటీఆర్ కౌంటర్ సూపర్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ అధికమవుతోంది. సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఆ తర్వాత కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే కేటీఆర్ కు కరోనా పాజిటివ్ రావడం పట్ల ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు గెట్ వెల్ సూన్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేశారు. అందులో మంచు లక్ష్మి కూడా ఉన్నారు. గెట్ వెల్ సూన్ కేటీఆర్… వాచ్ మై ఆల్ మూవీస్ నౌ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కు కేటీఆర్ గమ్మత్తయిన రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు రెస్ట్ కావాలి.. పనిష్మెంట్ కాదు అంటూ రిప్లై ఇచ్చారు. ఇక అది చూసిన నెటిజన్లు లక్ష్మి మంచు మీద సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement