Tuesday, May 7, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో)

పారమార్థికంగా రామాయణ సారం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ

రాముడు అనగా ఆనందింప చేయువాడు గాన పరమాత్మ. సీత నాగలి చాలులో పుట్టినది దవావాకాశములో కనపడేది కావున జీవాత్మ. జీవాత్మ పరమాత్మను ఎప్పుడూ అనుసరించే ఉండాలి. కావున సీత రాముని వెంట అడవికి కూడా వెళ్లింది. కాని అక్కడ బంగారు లేడిని చూచి కోరిక పుట్టి రామునికి దూరమైంది. భగవంతుని కంటే ఇతరమైన దానిని కోరితే భగవంతుని నుండి దూరమవుతారు. అలా కోరికను కలిగించేది మనస్సు,
ఆ మనస్సే రావణాసురుడు, మనసు కోరిక కలిగించి భగవంతునికి దూరం చేసి జీవుని శరీరంలో బంధించుతుంది. ఆ శరీరమే లంక, సంసార సాగరంలో శరీరం ఉంటుంది. సాగరంలోనే లంక ఉంటుంది. దూరమైన జీవుని జాడ తెలుసుకోవటానికి భగవంతుడు గురువును పంపిస్తాడు. ఆ గురువే హనుమంతుడు. గురువు చెప్పగా భగవంతుడు సంసారంలోనికి వచ్చి మనస్సును నిగ్రహించి జీవుని తన సన్నిధిలో చేర్చుకుంటాడు. హనుమంతుడు లంకను కాల్చినా సీతకేమి జరుగలేదని అన్నాడు వాల్మీకి. శరీరం కాలినా, ఆత్మ కాలదు. అందుకే సీత రెండో సారి అగ్నిప్రవేశం చేయడం, దానిలోని కోరికలు కాలిపోవటానికి. ఇలా భగవానుడు జీవుడు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయించి తన వద్దకు చేర్చకుంటాడు. అదే శ్రీరామపట్టాభి షేకం. ఇది రామాయణ పారమార్ధిక సారం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement