Sunday, April 28, 2024

మహేష్ తండ్రిగా మలయాళ నటుడు ?

గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలో నటించాడు మలయాళ నటుడు జయరామ్. అలాగే గతంలో భాగమతి సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రభాష్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం… పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ తండ్రిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement