Saturday, May 25, 2024

అభిమానులకు ‘సర్కారు’ ట్రీట్ సెట్ చేస్తున్నట్టేనా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మహేష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఆ లుక్ లో మహేష్ చెవిపోగు తో ట్యాటు తో కనిపించాడు.

అలాగే అప్పుడప్పుడు సర్కారు వారి పాట సెట్స్ నుంచి మహేష్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ ఫోటోలో మహేష్ క్యాజువల్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. మొదట యూనిట్ రిలీజ్ చేసిన ఫోటో కి ఈ ఫోటోకి అసలు సంబంధం లేదు. దీంతో ఈ సినిమాలో మహేష్ ….లుక్ విషయంలో అభిమానులకు మంచి ట్రీట్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి అది ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement