Sunday, June 9, 2024

Qualifier-2 | రాజ‌స్థాన్‌పై ఘన విజయం.. ఫైనల్స్‌కు హైదరాబాద్‌

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కు సన్‌రైజర్స్ జట్టు షాక్ ఇచ్చింది. కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌.. రాజస్థాన్ ముందు 176 పరుగుల మోస్తరు టార్గెట్ సెట్ చేసింది. ఇక డిఫెండింగ్‌లో రాణించడంతో.. రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో సన్‌రైజర్స్ జట్టు 36 పరుగల తేడాతో విజయం సాధించింది.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ లక్ష్యచేధనలో చతికిలపడింది. ఓపెన‌ర్ యశస్వి జైస్వాల్ (42), ధృవ్ జురెల్ (56 నాటౌట్) అధ‌ర‌గొట్టారు. అయితే, మిగిలిన వారు పూర్తిగా విఫలమవ్వడంతో 139 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్ జట్టు. ఇక ఎస్‌ఆర్‌‌హెచ్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2, నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసుకోవడంతో హైదరాబాద్ అద్భుతమైన విక్టరీ సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement