Saturday, June 15, 2024

Global Cities Index లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ఖ్యాతి అంతకంతకూ పెరుగుతోంది. ఐటీ, ఫార్మా రంగాలతో సహా ఆస్పత్రులు చివరికి పర్యావరణం, స్థిరాస్థి (రియల్‌ ఎస్టేట్‌) రంగంలో గమ్యస్థానంగా నిలిచిన హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఖ్యాతి సంపాందించింది.

ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి పరిస్థితులు మరింత విశిష్టంగా మారుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌-2024’ పేరుతో తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 564వ స్థానంలో హైదరాబాద్‌ ఉంది. గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ ప్రకారం ప్రపంచంలోని అగ్ర నగరాల జాబితాలో ఢిల్లి గ్లోబల్‌ ర్యాంక్‌ 350 సాధించి భారత్‌లో తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ జాబితాలో న్యూయార్క్‌ అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.

స్వతంత్ర ఆర్థిక సలహా సంస్థగా పేరొందిన ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ఇచ్చిన ర్యాంకింగ్‌లో భారతదేశంలోని టాప్‌-10 నగరాల జాబితాలో హైదరాబాద్‌ 9వ స్థానంలో నిలిచింది. ఎకనామిక్స్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన అనే నాలుగు అంశాల ఆధారంగా ర్యాంకులను ఇచ్చినట్టు గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ పేర్కొంది. నాలుగు ఇండెక్స్‌లో హైదరాబాద్‌ ఎకనామిక్స్‌లో అత్యుత్తమ పనితీరు కనబరించింది.

నాలుగు అంశాల ఆధారంగా హైదరాబాద్‌ నగర ప్రపంచ ర్యాకింగ్స్‌ ఇలా ఉన్నాయి.
ఎకనామిక్స్‌: 253
హ్యుమన్‌ క్యాపిటల్‌: 524
జీవన ప్రమాణాలు 882
పర్యావరణం: 674

- Advertisement -

భారతదేశంలోని టాప్‌ 10 నగరాల జాబితా – వాటి ప్రపంచ ర్యాకింగ్స్‌..

  1. ఢిల్లి: 350
  2. బెంగళూరు: 411
  3. ముంబై: 427
  4. చెన్నై: 472
  5. కొచ్చి: 521
  6. కోల్‌కతా: 528
  7. పూణే: 534
  8. త్రిసూర్‌: 550
  9. హైదరాబాద్‌: 564
  10. కోజికోడ్‌: 580
Advertisement

తాజా వార్తలు

Advertisement