Monday, June 24, 2024

Flash News – రెండు లారీలు ఢీ – మంటల్లో ఒక వాహనం దగ్ధం

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారి పై గుజరాత్ నుండి విశాఖపట్నం వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ, కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకుంది. ఈ ఘటనలో గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది..

.

ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగా, మిగతా ఇద్దరు క్యాబిన్లో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు వారిని కాపాడారు. కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ..

సమాచారం అందుకున్న పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవికుమార్, ఎస్ఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దగ్ధమవుతున్న లారీ మంటలను ఆర్పి వేశారు. ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేసి కేసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement