Sunday, June 16, 2024

Archery World Cup | ఫైనల్లో జ్యోతి-సురేఖ జోడీ..

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 పోటీల్లో భారత స్టార్‌ జ్యోతి సురేఖ వెన్నం-ప్రియాంష్‌ జోడీ కంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన కంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ-ప్రియాంష్‌ ద్వయం 158-157తో ఆతిథ్య కొరియా జంట హాన్‌ సెంగ్యోన్‌-యాంగ్‌ జేవాన్‌లను ఓడించి ఫైనల్స్‌లో ప్రవేశించారు.

హోరాహోరీగా జరిగిన ఈ సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ భారత జోడీ చివరి వరకు ఏకాగ్రతతో ఆడి స్వర్ణ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్స్‌లో భారత జంట అమెరికాకు చెందిన ప్రపంచ నెం.1 జోడీ ఓలివియా డీన్‌సాయెర్‌-సులివాన్‌తో ఢీ కొననుంది. మరో భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి మహిళల రీకర్వ్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగం సెమీస్‌లో ప్రవేశించి భారత్‌కు మరో పతకం ఖాయం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement