Monday, June 10, 2024

Invest | ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ పెట్టుబడి

ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 350 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 2023లో ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించిన 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిలో భాగంగా ఈ రౌండ్‌లో గూగుల్‌ 350 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ మైనార్టీ భాగస్వామిగా చేరనుంది.

ఇప్పటి వరకు గూగుల్‌ ఎంత పెట్టుబడి పెట్టింది వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు. బెంగళూర్‌ కేంద్రంగా పని చేస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ ఈ పెట్టుబడితో 5-10 శాతం ప్రీమియంతో విలువను పొందనుందని భావిస్తున్నారు. తాజా ఫ్లిప్‌కార్ట్‌ విలువ 36 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement