Saturday, April 27, 2024

వకీల్ సాబ్ ప్రమోషన్స్ మాములుగా లేవు !!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో అంజలి, నివేదాథామస్, అనన్య కీలక పాత్రలో నటించగా… శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతోంది.

కాగా ఆ ఛానల్ వారు ఓ వైపు సోషల్ మీడియాలో ప్రమోషన్ ఇస్తూనే ఆఫ్ లైన్ లో కూడా అదిరిపోయే ప్రమోషన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై హైదరాబాద్ పరిసరాల్లో భారీ కటౌట్స్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇది వరకు టెలివిజన్ ప్రీమియర్ కు ఈ స్థాయిలో ప్రమోషన్స్ ఎక్కడా జరగలేదు. మరి వకీల్ సాబ్ ఎంతమేరకు టిఆర్పి ని రాబెడుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement