Thursday, May 16, 2024

Lakshmika Sajeevan – షూటింగ్ లోనే గుండెపోటు …. యంగ్ హీరోయిన్ క‌న్నుమూత …

ఇటీవ‌ల గుండెపోటుతో యువ‌త ఎక్కువ‌గా మ‌ర‌ణిస్తున్నారు.. పిన్న వ‌య‌సులో గుండెపోటు ఊపిరి తీసేస్తున్న‌ది.. తాజాగా యంగ్ హీరోయిన్ హర్ట్ ఎటాక్ తో లక్ష్మిక సజీవన్ ( (24) గుండెపోటుతో మృతి చెందింది. ప్రస్తుతం యూఏఈ లోని షార్జాలో మృతి చెందింది. ఈ 24 ఏళ్ల హీరోయిన్ షూటింగ్లో ఉండ‌గానే గుండె పోటుకు గురై ఆ వెంట‌నే మ‌ర‌ణించింది.. చిన్న వయస్సులో హీరోయిన్ చనిపోవడంతో కేరళ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. లక్ష్మిక మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.

అజు అజీష్ డైరెక్ట్ చేసిన ‘కాక్క’ షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక..ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. శారీరక వైకల్యాలతో అవహేళనకు గురైన అట్టడుగు ప్రజల బతుకు కథే ఈ కక్కా.రీసెంట్ గా లక్ష్మిక ఉయిరే, దుల్కర్ సల్మాన్ సౌదీ వెల్లక్క, ఒరు యామందం ప్రేమకథ, పంచవర్ణతథా తో పాటు పలు మూవీస్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. లక్ష్మిక తనకు వచ్చిన చిన్న చిన్న పాత్రలతో..కెరీర్ మొదలు పెట్టి..మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో.. లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి చెందడం..అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఆమె మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement