Saturday, May 4, 2024

RC16 | రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కి కాస్టింగ్ కాల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘‘గేమ్ చేంజర్’’. ఈ పొలిటికల్ డ్రామాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమా అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు రామ్ చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ మూవీకి నటించేందుకు కొత్త నటులకు మైత్రీ మూవీ మేకర్స్ ఆహ్వానం పలికింది. ఉత్తరాంధ్ర గ్రామీణ యాస మాట్లాడగలిగి, నటనపై ఆసక్తి ఉన్న వారి కోసం చూస్తున్నామని తెలిపింది. అన్ని ఏజ్ గ్రూపుల వారికి (పురుషులు, మహిళలు) అవకాశం ఉందని ప్రకటించింది. ఒక నిమిషం యాక్టింగ్ వీడియోను, 3 ఫొటోలను, కాంటాక్ట్ డీటెయిల్స్ ను [email protected] కు మెయిల్ చేయవచ్చని/ వాట్సాప్ నెంబర్ 91 8143682909కు పంపించవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement