Saturday, October 12, 2024

AP : టీడీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు ప‌డింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు.

- Advertisement -

దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఛైర్మన్.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement